Thursday, 1 November 2012

Eat Guava....:)





పేదోళ్ళ ఆపిల్ లో అన్నీ ఎక్కువే..
దీన్ని కూడా రోజుకి ఒక్కటి తింటే చాలు, డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు.

ఒకింత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. దాని వల్ల మలబద్దకం తేలిగ్గా తగ్గుతుంది. కేవలం ఈ ఒక్క ప్రయోజనం వల్లనే ఎన్నో వ్యాధులను ముందుగానే నివారించవచ్చు. మామూలుగా విటమిన్-సి కావాలంటే అందరికీ గుర్తొచ్చేవి నిమ్మజాతి పుల్లటి పండ్లు.

కానీ... నారింజలో ఉండే విటమిన్-సి పాళ్ల కంటే జామపొట్టులో ఉండే విటమిన్-సి ఎక్కువ. దీనితో పాటు టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్ పాళ్లు ఎక్కువని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. లైకోపిన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక క్యాన్సర్లను నివారిస్తుంది. అదే ప్రయోజనం జామతో కూడా ఉంటుందన్నమాట. అంతేకాదు ఈ లైకోపిన్ ఉన్నందున జామ ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను కూడా నివారించడంలో దోహదపడుతుంది.

పైగా 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. దీనికి తోడు జామలో పొటాషియమ్ ఎక్కువ కాబట్టి అది రక్తపోటును సమర్థంగా నివారించగలదు.

No comments:

Post a Comment