Tuesday, 30 October 2012

Remedy for heavy weight,BP etc...





అధికబరువు, ఎసిడిటీ, బి.పి తగ్గించి వ్యాధి నిరోధకశక్తి పెంచే చిట్కాలు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని రోజు ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువుని నివారించవచ్చు. ఇలా తాగడం వలన కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

రోజూ ఉదయాన్నే పరగడుపున కొంచెం నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగితే కిడ్నీలు బాగా పనిచేస్తాయి, వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది.

ఎసిడిటితో బాధపడుతుంటే క్యారెట్, దోస, ముల్లంగి, బీట్ రూట్ లలో ఏదైనా జ్యూస్ తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. జీలకర్రతో షర్బత్ చేసుకుని తాగినా ఎసిడిటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అధిక రక్తపోటు ( హై బీపి ) తో బాధపడేవారు ఉసిరి రసం, తేనె సమపాళ్ళల్లో తీసుకుని కలిపి ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ తాగితే బీపి అదుపులో ఉంటుంది.

No comments:

Post a Comment